![]() |
![]() |
.webp)
కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఎఫెక్ట్ ఇప్పుడు అందరి ఇళ్ల మీద కూడా పడుతోంది. ఇంట్లో కూడా కుమారి ఆంటీ రీల్స్ చేస్తూ వాటిని ఇంకా ట్రెండ్ చేస్తున్నారు చిన్నా పెద్దా సెలబ్రిటీస్. ఇప్పుడు యాంకర్ లాస్య ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. తన భర్త మంజూనాథ్ డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీని తీసుకుని లాస్యను కొడుతున్నట్టుగా ఉంది ఆ వీడియో.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.ఇంతకు మంజూనాథ్.. లాస్యను కొట్టాడు, అసలు అతనికి కోపం తెప్పించేంత పని లాస్య ఏం చేసిందో తెలియాలి అంటే ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. లాస్య తన భర్త మంజునాధ్ కి చేపల కూర వడ్డిస్తూ.. 'మీది మొత్తం థౌసండ్ అయ్యింది. రెండు లీవర్లు ఎక్స్ట్రా ' అని కుమారి ఆంటీ వాయిస్ రీల్ కి లిప్ సింక్ ఇచ్చేసరికి మంజునాధ్ కి మండిపోయింది. దీంతో మంజునాథ్ ఫన్నీగా లాస్యను కుర్చీతో కొట్టాడు. ఈ వీడియోని లాస్య పోస్ట్ చేసింది. "జస్ట్ ఫర్ ఫన్... మీరు ఈ ఫన్నీ వీడియోను ఇష్టపడతారనుకుంటున్నాను" అంటూ లాస్య క్యాప్షన్ పెట్టుకుంది. ఇక లాస్య ఇప్పుడు వెయిట్ లాస్ కావడానికి స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తోంది. బేబీ పుట్టాక 66 కేజీలు పెరిగిపోయింది.
అందులో కొంతైనా తగ్గాలి అంటూ డైట్ తీసుకుంటున్నట్లు చెప్పింది. అలాగే ఆ డైట్ ని ఎలా ప్లాన్ చేసింది అనే విషయాలను జోడించి ఒక వీడియో చేసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఒకప్పుడు క్యూట్ యాంకర్స్ గా ఉండేవాళ్ళు లాస్య, రవి. వీళ్ళ జోడిని చూడడానికే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేవాళ్లు. మా టీవీలో వచ్చే సమ్ థింగ్ స్పెషల్ షోతో ఈ ఇద్దరూ ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆడియన్స్ కి ఏనుగు- చీమ జోక్స్ చెప్తూ ఎంటర్టైన్ చేసేది. ఇక లాస్య.. మంజునాధ్ ని లవ్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ ఐపోయింది.
![]() |
![]() |